ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) సోమవారం ప్రారంభమైంది. తొలిరోజు తెలుగు పరీక్ష (పేపర్-2ఎ) రెండు పూటలా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 57 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. ఉదయం 8,,148 అభ్యర్ధులకు కేటాయించగా, వీరిలో 7453(91.4శాతం) మంది అభ్యర్ధులు హాజరయ్యారని టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మధ్యాహ్నం 42 పరీక్షా కేంద్రాల్లో 5,801 మంది అభ్యర్ధులను కేటాయించగా 5,342(91.78శాతం)మంది హాజరయ్యారు. ఉదయం సెషన్ లో అనంతపురం జిల్లాలో 93.94శాతం, మధ్యాహ్నం సెషన్‌లో కడప జిల్లా 94.8శాతం అత్యధికంగా హాజరయ్యారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కన్వీనర్ వెల్లడించారు.








కామెంట్‌లు (0)