శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసిఇసి రాజీనామా చేసేంత వరకు ఉద్యమం

7 గంటల క్రితం

సిఇసి రాజీనామా చేసేంత వరకు ఉద్యమం
- వైఎస్‌ఆర్‌ కడప, విశాఖలో జ్ఞానేష్‌ కుమార్‌ దిష్టిబొమ్మలు దగ్ధం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 10:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • వైఎస్‌ఆర్‌ కడప, విశాఖలో జ్ఞానేష్‌ కుమార్‌ దిష్టిబొమ్మలు దగ్ధం

​ప్రజాశక్తి - యంత్రాంగం : ఓటు చోరీకి పాల్పడ్డ సిఇసి జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేసేంత వరకూ ఉద్యమం కొనసాగుతుందని ఇండియా వేదిక నాయకులు హెచ్చరించారు. తొలగించిన ఓట్లను తిరిగి చేర్చాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజ్యాంగ వ్యవస్థలను నీరుగార్చారని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో కేంద్ర ఎన్నికల కమిషనర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ర్ట కార్యదర్శి సావిత్రి మాట్లాడుతూ... కేంద్ర ఎన్నికల కమిషనర్ 13 కోట్ల ఓట్లు తొలగింపునకు కారణమైన అధికారిని బిజెపి ప్రభుత్వం విధుల్లో కొనసాగించడం దుర్మార్గమన్నారు. జ్ఞానేష్‌ కుమార్‌‌ను సస్పెండ్ చేసే వరకూ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెవివి రాష్ట్ర కార్యదర్శి సురేష్ , సిఐటియు, ఐద్వా, డివైఎఫ్‌ఐ, వ్యకాస నాయకులు పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో మల్కాపురం, తగరపువలసల్లో జ్ఞానేష్‌ కుమార్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పిఠాపురం కాలనీలోని సిపిఎం జిల్లా కార్యాలయం నుంచి మద్దిలపాలెం జాతీయ రహదారి వరకూ ర్యాలీ నిర్వహించారు. గాజువాక, కంచరపాలెం, పెందుర్తి, పూర్ణామార్కెట్‌, పెదగంట్యాడ ప్రాంతాల్లో నిరసనలు తెలిపారు. జ్ఞానేష్‌ ‌కుమార్‌ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరంగా మారాయని పలువురు విమర్శించారు.

అనంతపురం జిల్లాల్లో పుట్టపర్తి, ధర్మవరం హిందూపురంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఎఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరులో గాంధీ బొమ్మ వద్ద నల్ల రిబ్బన్లతో కాంగ్రెస్‌ నాయకులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష‍ులు కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ... ప్రతిపక్ష ఎంపిలు శాంతియుత నిరసనలు చేపడితే దాడులు, అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి కళంకమన్నారు. న్యాయవాది సుధీర్ మాట్లాడుతూ.. జవాబుదారితనంతో కూడిన పారదర్శకంగా ఉండే ఎన్నికల వ్యవస్థను రూపొందించాలని డిమాండ్‌ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్