గురువారం, 16 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నేటి నుంచి తెలంగాణలో బోనాల జాతర ప్రారంభం

17 గంటల క్రితం

The Bonalu festival begins in Telangana today
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 08:32 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : తెలంగాణలో ఆషాఢ మాసం బోనాల జాతర జులై 16వ తేదీ నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో జరిగే తొలిపూజతో ఈ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా మొదలవుతాయి. ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ ఉదయం లంగర్‌హౌస్‌లో ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. అనంతరం, పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో తొట్టెలను గోల్కొండ కోటలోని అమ్మవారి ఆలయానికి సమర్పిస్తారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్