ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సచివాలయ ఉద్యోగులపై కూటమి సర్కార్‌ ‌తీరు దుర్మార్గం

6 రోజుల క్రితం

sda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 09:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- వైసిపి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌‌బాబు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: సచివాలయ ఉద్యోగులపై కూటమి సర్కార్ ఉక్కుపాదం అత్యంత దుర్మార్గమని, నాడు బషీర్‌బాగ్‌లో గుర్రాలతో తొక్కించారని, నేడు సచివాలయ ఉద్యోగులపై లాఠీలతో విరుచుకుపడ్డారని వైసిపి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టిజెఆర్‌ ‌సుధాకర్‌‌బాబు తెలిపారు. ఆదివారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని చంద్రబాబు భ్రష్టుపట్టించారని, సచివాలయ ఉద్యోగుల పోరాటానికి వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని అన్నారు. సర్ప్లస్ ఎంప్లాయ్‌మెంట్ అనే తప్పుడు వాదనతో గ్రూపింగ్ వ్యవస్థ పేరు తెచ్చి దాదాపు 30 వేల మంది సచివాలయ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అన్నారు. మెరిట్‌తో ఉద్యోగాలు సాధించిన విద్యావంతులను నడిరోడ్లపైకి ఈడ్చి లాఠీఛార్జ్ చేయించడం ప్రభుత్వానికే సిగ్గుచేటని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్