ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

యువత వైపు దేశం చూస్తోంది

1 గంట క్రితం

poetry
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 12:40 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- కాక్రోచ్ వాయిస్ కవితా గోష్టిలో సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్

ప్రజాశక్తి - కర్నూలు కల్చరల్ : కాక్రోచ్ ఉద్యమ విజయంతో నవభారత నిర్మాణానికి పునాదులు పడినట్లయిందని, ఆ విజయానికి కారణమైన యువత వైపు దేశం చూస్తోందని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ అన్నారు. సాహితీ స్రవంతి జిల్లా కమిటీ ఆధ్వర్యాన టిజివి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన కాక్రోచ్ వాయిస్ కవితా గోష్టిలో పాల్గొని ఆప్తవాక్యం పలికారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల చక్రపాణి యాదవ్ సబ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కెంగార మోహన్‌ మాట్లాడుతూ దేశాన్ని కుదిపేసిన నీట్ లీకేజీ వ్యవహారంపై అసహనానికి లోనైన యువత పిడికిలి బిగించి తిరగబడిందన్నారు. ఇది మార్పుకు సంకేతమని, యువత నవభారతాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. జెన్ జీ ఉద్యమకారులు అవినీతి లేని, అసమానతలు లేని పారదర్శకమైన నవీన సమాజాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు మాట్లాడుతూ నీట్ లీకేజీతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు సమాధానం ఎవరు చెబుతారని ప్రశ్నించారు. తిరుగుబాటు మొదలైందని, యువత చేస్తున్న ఉద్యమంలో కవులు భాగస్వాములవ్వాలని కోరారు. అనంతరం కవితా గోష్టిని నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆకెపోగు నాగరాజు, డి.పార్వతయ్య నిర్వహించారు. కవితా గోష్టిలో జెన్ జీ ఉద్యమానికి సంఘీభావంగా కవులు కల్యాణదుర్గం స్వర్ణలత, నల్ల బోతుల నాగమణి, కరణం పద్మజ, తెలుగు వెంకటేష్, కొత్తూరు సత్యనారాయణ గుప్తా, వి.వెంకటేశ్వర్లు తదితరులు కవితలు వినిపించారు. సాహితీ స్రవంతి జిల్లా గౌరవాధ్యక్షులు ఎంపి బసవరాజు చైతన్య గీతాన్ని పాడి అలరించారు. పాల్గొన్న కవులకు ప్రముఖ కవి జి.వెంకట కృష్ణ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. సభలో రాయలసీమ ప్రచురణలు గౌరవ సంపాదకులు మారుతి పౌరోహితం, అక్షరం ట్రస్ట్ సభ్యులు అవిజ వెంకటేశ్వర రెడ్డి, ప్రముఖ నవలా రచయిత ఎస్‌‌డివి అజీజ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్