శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

జైలుకెళ్లినా వీడని ధైర్యం

05 జులై, 2026

aiks
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 10:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- అప్పలరాజు దంపతులకు అభినందన

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్ : జైలుకెళ్లినా ధైర్యంగా నిలిచిన అప్పలరాజు భార్య ఎం.లక్ష్మీని కిసాన్ సభ ఆలిండియా నేత విజ్జూ కృష్ణన్ ఏలూరులో జరుగుతున్న ఎపి రైతు సంఘం మహాసభలో అభినందించారు. హోం మంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో బల్క్‌డ్రగ్‌ పార్క్‌ పేరుతో రైతుల భూములు తీసుకునే ప్రయత్నానికి ప్రతిఘటన ఎదురైంది. దీంతో, పోలీసులు కక్షగట్టి రైతులకు, నిర్వాసితులకు అండగా ఉంటున్న ఎపి రైతు సంఘం నేత ఎం.అప్పలరాజుపై కేసు కట్టారు. స*ాధారణ కేసులు కడితే బెయిల్ వస్తుందని ఏకంగా పీడీ యాక్ట్ పెట్టారు. హుటాహుటిన ఓ రాత్రి ఇంటి మీద దాడి చేసి పోలీసులు ఆయనను వైజాగ్ సెంట్రల్ జైలుకు తరలించారు. రైతు నేత మీద పీడీయాక్ట్ చాలా పెద్ద వివాదమే అయ్యింది. ప్రభుత్వానికి ఎన్నిమార్లు విన్నవించినా పెడచెవిన పెట్టింది.

అయినా అప్పలరాజు భార్య, తల్లి, కుటుంబ సభ్యులు మొక్కవోని ధైర్యంతో ఉన్నారు. ఎపి రైతు సంఘం వారికి అండగా నిలిచింది. చివరకు ఎపి హైకోర్ట్ జోక్యం చేసుకుని పీడీ యాక్ట్ చెల్లదని ఆదేశాలిచ్చింది. దీంతో అనివార్యంగా అప్పలరాజును విడుదల చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ బల్క్‌డ్రగ్‌ పార్క్ రైతుల భూములు తీసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వముంది. ఈ నేపథ్యంలో రైతు సంఘం మహాసభలో అప్పలరాజు దంపతులను విజ్జూ కృష్ణన్‌ అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్