- ఎపి రైతు సంఘం డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : యూ ట్యూబర్ ప్రశ్న రావణ్ పై పోలీసులు అక్రమంగా పెట్టిన ఉపాచట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శిలు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రశ్నించడమే నేరంగా కనిపిస్తోందని విమర్శించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ద వైర్ వెబ్ పోర్టల్ వ్యవస్ధాపకులు ప్రబీర్ పురకాయస్థ పై మనీలాండరింగ్ తదితర నేరాలకు పాల్పడ్డారని అక్రమంగా ఉపా చట్టాన్ని ప్రయోగించి ఆరునెలలకు పైగా జైలులో నిర్భందించారని తెలిపారు. కేంద్ర అడుగుజాడల్లో, రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. వివిధ పోలీసు స్టేషన్ లో రావణ్ పై పెట్టిన కేసులన్నీంటినీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కౌలు రైతు సంఘం ఖండన
యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై రాష్ట్ర పోలీసులు అక్రమంగా ఉపా చట్టం ప్రయోగించడాన్ని ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. తక్షణమే ప్రశ్న రావణ్ పై పెట్టిన ఉపా చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి బి.బలరాం, ఎమ్.హరిబాబు సోమవారం మరోక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాజ్యాంగం ప్రశ్నించే హక్కును ప్రజలందరికీ ఇచ్చిందని తెలిపారు. ప్రశ్నించే గొంతుకను నొక్కే పద్దతిలో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించడం సరైందికాదని హితవు పలికారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నమైందని పేర్కొన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక పద్దతులను ప్రభుత్వం మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు.








కామెంట్‌లు (0)