అమరావతి : 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను శనివారం సాయంత్రం ప్రకటించిన సంగతి విదితమే. ఈ క్రమంలో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. అవార్డు గ్రహీతలందరికీ భవిష్యత్తులో మరిన్ని విజయాలు, మరెన్నో ప్రశంసలు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బెస్ట్ విషెస్ తెలిపారు. ఆదివారం సోషల్ మీడియా వేదికగా సిఎం చంద్రబాబు స్పందిస్తూ .... సినిమా కీర్తిని మరింత పెంచి, తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎనలేని గర్వకారణంగా నిలిచిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, చిత్ర బృంద సభ్యులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. కళ, సంస్కృతి, సినిమా మన గుర్తింపునకు, వారసత్వానికి బలమైన స్తంభాలని చెప్పారు. తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, తన ప్రతిభతో రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. అవార్డు గ్రహీతలందరికీ భవిష్యత్తులో మరిన్ని విజయాలు, మరెన్నో ప్రశంసలు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బెస్ట్ విషెస్ తెలిపారు. 72వ జాతీయ చలన చిత్ర పురస్కార విజేతలను సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్లు ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం అభినందనీయమన్నారు. నేషనల్ ఫిలిమ్స్‌లో 9 అవార్డులతో టాలీవుడ్ సత్తా చూపించడం గర్వంగా ఉందని దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. కథ, నటన, సాంకేతిక నైపుణ్యం, కాస్ట్యూమ్ డిజైనింగ్, మేకప్, నిర్మాణ విలువలు ఇలా అన్ని విభాగాల్లో తెలుగు సినిమా ప్రతిభ చాటిందని కొనియడారు.
వారందరికీ భవిష్యత్తులో మరెన్నో ప్రశంసలు దక్కాలి : సిఎం చంద్రబాబు
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 19, 2026, 12:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)