ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

థింసా అదరహో

1 రోజు క్రితం

dimsa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 11:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- గిన్నిస్ బుక్ లో చోటు

- భోగాపురం ఎయిర్ పోర్టులో ఆవిష్కృతమైన అద్భుత నృత్యం

- గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి సర్టిఫికెట్‌‌ అందజేత

ప్రజాశక్తి-భోగాపురం, విజయనగరం కోట : ​భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రదర్శించిన థింసా నృత్యానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌‌లో చోటుదక్కింది. ఆ సంస్థ ప్రతినిధులు ప్రత్యక్షంగా తిలకించి వరల్డ్ రికార్డ్స్‌‌కు సంబంధించిన సర్టిఫికెట్‌‌ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి అందజేశారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేలా 13 వేల మంది గిరిజన మహిళలు, విద్యార్థినులు ఏకకాలంలో సంప్రదాయ థింసా నృత్యాన్ని ప్రదర్శించారు.

ఈ సందర్భంగా గిరిజన సంక్షే శాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ మాట్లాడుతూ ఇంతమందితో థింసా ప్రదర్శించడం చరిత్రాత్మకమని, లండన్ నుండి విచ్చేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బృందం నృత్యాన్ని తిలకించి అభినందించిందని తెలిపారు. కార్యక్రమంలో ప్రధాని పర్యటన నోడల్ అధికారి కృష్ణ బాబు, జిల్లా కలెక్టర్ ఎస్ రాం సుందర్ రెడ్డి, గిరిజన సంక్షే శాఖ డైరెక్టర్ ఎస్ భార్గవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్