గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతుఫాన్‌ వరదలకు ముగ్గురు వ్యవసాయ కూలీలు గల్లంతు

2 గంటల క్రితం

death.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 06:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పంపా నది వద్ద మృతదేహాలు లభ్యం

ప్రజాశక్తి – శంఖవరం (కాకినాడ) : తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరద నీటిలో కొట్టుకుపోయిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. తండ్రి, ఇద్దరు కుమారుల మృతదేహాలను పోలీసులు, గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టి అన్నవరం పంపా రిజర్వాయర్‌ సమీపంలో వెలికితీశారు. మండల కేంద్రమైన శంఖవరం గ్రామానికి చెందిన పిల్లా యతిమాని (55), ఆయన కుమారులు దుర్గాప్రసాద్‌ (30), రాజేష్‌ (20) బుధవారం తమ వ్యవసాయ భూమిలో ఉన్న మోటారు సామగ్రి వర్షాలకు దెబ్బతినకుండా ఇంటికి తీసుకెళ్లేందుకు పొలానికి వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వరద నీటి ఉద్ధృతి పెరగడంతో ముగ్గురూ నీటిలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అన్నవరం పంపా రిజర్వాయర్‌ సమీపంలో ముగ్గురి మృతదేహాలను గుర్తించి వెలికితీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో వారి కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్‌ఐ హరిబాబు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్