లైటింగ్ ఆర్చ్ కూలి విద్యార్థిని మృతి.. మరో 14 మందికి గాయాలు
ప్రజాశక్తి – హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని నాదర్‌గుల్ ఎంవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ప్రమాదానికి సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈవెంట్ మేనేజర్ సాకేత్ కంపెనీకి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. లైటింగ్ పోల్‌కు సరైన సపోర్టు లేకుండా ఏర్పాటు చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి కళాశాల యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేశారు.
కళాశాలలో శనివారం నిర్వహించిన డాండియా వేడుకల్లో లైటింగ్ ఆర్చ్ ఒక్కసారిగా కూలిపోవడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రథమ సంవత్సరం బీటెక్ విద్యార్థిని నారాయణదాసు సోనా (18) మృతి చెందగా, మరో 14 మంది విద్యార్థులు గాయపడ్డారు. మృతురాలి సోదరి మీనా కూడా గాయపడిన విషయం తెలిసిందే..







కామెంట్‌లు (0)