బుధవారం, 22 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగుంటూరులో మరో మూడు కరోనా కేసులు

6 గంటల క్రితం

covide
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 12:08 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఆస్పత్రిలో మూడు రోజుల క్రితం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం లక్షణాలతో వస్తున్న రోగులకు ఆర్‌‌టిపిసిఆర్‌ ‌పరీక్షలు చేస్తున్నారు. మంగళ వారం 13 మందికి పరీక్షలు చేయగా ముగ్గురికి కరోనా లక్షణాలు నిర్ధారణ అయ్యాయని, మిగతా పది మందికి ఎటువంటి లక్షణాలూ లేవని సూపరింటెండెంట్‌ ‌డాక్టర్‌ జి.దుర్గా ప్రసాద్‌ ‌తెలిపారు. ప్రతి కరోనా వైరస్‌ ‌నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు ఆయన వివరించారు. జిల్లాలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇప్పటి వరకు మొత్తం నాలుగు కేసులు వచ్చాయి. ఎయిమ్స్‌‌లో మరో ఆరు కేసులు నమోదయ్యాయి. గత మూడు రోజుల వ్యవధిలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పది కేసులు నమోదయ్యాయి.​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్