ప్రజాశక్తి -దేవరపల్లి : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం మేరీమాత ఆలయం సమీపంలోని క్వారీల్లో పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పులి మెడకు అమర్చిన జిపిఎస్ ట్రాకర్ ద్వారా పులి కదలికలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. బోను, యాంటెన్నా తదితర పరికరాలను ఏర్పాటు చేసి, అవసరమైతే మత్తు ఇంజెక్షన్ ద్వారా పులిని బంధించేందుకు చర్యలు చేపట్టారు. పులి సంచారం నేపథ్యంలో గౌరీపట్నం, పరిసర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. క్వారీలు, పొలాలు, అటవీ ప్రాంతాల వైపు ఒంటరిగా వెళ్లవద్దని, రాత్రి వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రచారం చేశారు. రెండు రోజుల క్రితం సీతానగరం మండలం వైపు నుంచి గోదావరి దాటి ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం గౌరీపట్నం పరిసరాల్లో పులి కదలికలు గుర్తించడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
Print Editionగౌరీపట్నం క్వారీల్లో పెద్దపులి సంచారం
08 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 08, 2026, 08:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)