బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనేడు జెన్‌ జీ ఉద్యమ ప్రస్థానం సెమినార్‌

1 గంట క్రితం

Aishe Ghosh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 12:08 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • విజయవాడకు చేరుకున్న ఎస్ఎఫ్‌ఐ జాతీయ నాయకులు ఐషీ ఘోష్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విజయవాడ ఎంబివికెలో గురువారం నాడు జరిగే జెన్‌ ‌జీ ఉద్యమ ప్రస్థానం సెమినార్‌‌కు ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ నాయకులు ఐషీ ఘోష్‌ హాజరవుతున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్న కుమార్‌ తెలిపారు. ఈ సెమినార్‌‌లో ఐషీ ఘోష్, మాజీ ఎమ్మెల్సీ కెఎస్‌ ‌లక్ష్మణరావు ప్రసంగిస్తారని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జెన్ జీ ఉద్యమం తీరు తెన్నులు, కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆమె మాట్లాడతారని తెలిపారు. బుధవారం నాడు విజయవాడకు చేరుకున్న ఆమెకు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎస్‌ఎఫ్‌ఐ, ప్రజా సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. సెమినార్‌‌కు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్