శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionటమాటా డిమాండ్‌కు అనుగుణంగా ధరలు

1 గంట క్రితం

tamata
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 07:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మార్కెటింగ్‌శాఖ డైరెక్టరు రవి పట్టన్ శెట్టి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాయలసీమ టమాటా మార్కెట్లలో డిమాండ్‌కు అనుగుణంగా ధరల హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయని మార్కెటింగ్ శాఖ డైరెక్టరు రవి పట్టన్ శెట్టి తెలిపారు. రాయలసీమ ప్రాంతంలోని పలమనేరు, వి కోట, పుంగనూరు, మదనపల్లె, ములకలచెరువు, గుర్రంకొండ, కలికిరి, పట్టికొండ, రాప్తాడు, పీపుల్లి మార్కెట్ యార్డులకు మొత్తం 5,564.91 టన్నుల మొదటి రకం, 6,650.17 టన్నుల రెండవ రకం టమాటాలు చేరగా, మొత్తంగా 12,215.08 టన్నులొచ్చాయని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పలమనేరు, వి కోట, పుంగనూరు, మదనపల్లె మార్కెట్ యార్డుల్లో నాణ్యమైన టమాటా రాకతో ధరలు నిలకడగా నమోదయ్యాయని, కలికిరి మార్కెట్‌లో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరగడం వల్ల గత వారం కంటే మెరుగైన ధరలు లభించినప్పటికీ, ఇటీవల స్వల్ప తగ్గుదల కనిపించిందన్నారు. రాప్తాడు ప్రైవేట్ మార్కెట్‌‌కు అత్యధికంగా 6,750 మెట్రిక్ టన్నుల టమాటాలు వచ్చాయని తెలిపారు. అధిక ఉత్పత్తి, స్థానిక మార్కెట్లకు భారీగా వస్తున్న సరుకు, అలాగే కర్ణాటక, చిత్తూరు, హిమాచల్‌ప్రదేశ్ ప్రాంతాల నుంచి సరఫరా పెరగడం వల్ల మార్కెట్లో లభ్యత అధికమై ధరలు కొంత తగ్గినట్లు పేర్కొన్నారు. రైతులు టమాటాను నాణ్యత ఆధారంగా గ్రేడింగ్ చేసి మార్కెట్‌కు తీసుకొస్తే మెరుగైన ధరలు పొందే అవకాశం ఉంటుందని సూచించారు. మార్కెటింగ్ శాఖ మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు రోజువారీ ధరలు, మార్కెట్ ధోరణులపై తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్