ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమలాపురంలో కుండపోత

1 గంట క్రితం

rain.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 11:44 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • భారీ వర్షంతో పట్టణం జలమయం

  • రాకపోకలకు తీవ్ర అంతరాయం

ప్రజాశక్తి – అమలాపురం: అమలాపురం పట్టణంలో ఆదివారం ఉదయం కుండపోత వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హౌసింగ్‌ బోర్డు కాలనీ, విద్యుత్‌నగర్‌, గారపాటి వీధి, మహిపాల వీధి, రవణం వీధి, సావరం తదితర ప్రాంతాలు నీట మునిగాయి. డ్రెయిన్లు పొంగిపొర్లడంతో వర్షపు నీరు రహదారులపైకి చేరింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల ముందు, వ్యాపార సముదాయాల వద్ద కూడా నీరు నిలిచిపోయింది. రహదారులపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ద్విచక్ర వాహనదారులు నీటిలోనే ప్రయాణించాల్సి వచ్చింది. నిలిచిన నీటిని తొలగించేందుకు మున్సిపల్‌ సచివాలయ సిబ్బంది చర్యలు చేపట్టారు. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల వర్షపు నీరు త్వరగా బయటకు వెళ్లడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ భారీ వర్షాల సమయంలో ఇదే పరిస్థితి నెలకొందని తెలిపారు. డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి, వర్షపు నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు. ఇదిలా ఉండగా, అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

rain.jpeg

rain 2.jpeg


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్