శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు

07 జులై, 2026

amaravati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 11:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: నల్లమల అటవీ ప్రాంతంలో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ చేపట్టిన సర్వేలో నాటి ఆంధ్రుల రాజధానిగా వెలుగులీనిన అమరావతి చరిత్రను తెలియజేసే శాసనాలు వెలుగులోకి రావడం అద్భుత పరిణామమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. గత నెల 10వ తేదీన ప్రకాశం జిల్లా, అయ్యంబొట్లపల్లె గ్రామం వెలుపల మొదలుపెట్టిన అన్వేషణలో తెలుగు లిపిలో చెక్కిన 13వ శతాబ్దానికి చెందిన శాసనాలు వెలుగులోకి వచ్చాయని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాకతీయ రాణి రుద్రమదేవి వద్ద సేనాపతిగా పని చేసిన మల్లికార్జున నాయకుడు నాటి ధాన్యకటకం, నేటి ఆమరావతిలోని బుద్ధదేవునికి కృష్ణానది తీరంలోని వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చినట్టు సదరు శాసనం తెలియజేస్తున్నట్టు పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు. మన చారిత్రక వారసత్వ సాక్ష్యాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తోన్న పురావస్తు శాస్త్రవేత్తలకు, వారికి సహకరిస్తున్న రాష్ట్ర అటవీశాఖ సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్