ప్రజాశక్తి-గూడూరు: కృష్ణా జిల్లా గూడూరు మండల కేంద్రంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అత్త రజని (60), కుమార్తె గౌరి (40), కోడలు మధు(35) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ ముగ్గురు మహిళల మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో గూడూరు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
గూడూరులో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మహిళలు ఆత్మహత్య
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 04, 2026, 11:43 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)