- విశాల్ గున్ని, క్రాంతి రాణాకు పోస్టింగు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పలువురు ఐపిఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు జిఓ 1829ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ ఆదివారం విడుదల చేశారు. సస్పెన్షన్‌లో ఉండి ఇటీవల మరలా సర్వీస్‌లోకి వచ్చిన క్రాంతిరాణా టాటా, విశాల్ గున్నికి పోస్టింగు ఇచ్చింది. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్డు సేఫ్ట్ డైరెక్టరేట్ ఐజిగా క్రాంతిరాణాను, ట్రైనింగ్ డిఐజిగా విశాల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పిఎఫ్) డిజిగా ఉన్న సిఎం త్రివిక్రమ్ వర్మను ఫోరెనిక్స్ సెన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్‌గా, ఎసిబి డైరెక్టర్‌గా ఉన్న ఆర్ జయలక్ష్మిని సిఐడి ఐజిగా బదిలీ చేసింది. ఎపిఎస్‌పి బెటాలియన్స్ ఐజిగా ఉన్న బి రాజకుమారిని రైల్వే ఐజిపితో పాటు సిఐడి మహిళా భద్రత ఇన్‌ఛార్జి ఐజిగా పోస్టింగ్ ఇచ్చింది. గ్రేహౌండ్స్ డిఐజిగా ఉన్న బాబూజీ అట్టాడకు టెక్నికల్ సర్వీసెస్ డిఐజితో పాటు గ్రేహౌండ్స్ డిఐజిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. పోలవరం ఒఎస్‌డిగా ఉన్న పంకజ్‌కుమార్ మీనాను మార్కాపురం ఎస్‌పిగా, సిఎంఎస్‌జి ఎస్‌పిగా ఉన్న జగదీష్‌ను పల్నాడు ఎస్‌పిగా, సిఐడి ఎస్‌పిగా ఉన్న కె చక్రవర్తిని పోలవరం ఎస్‌పిగా బదిలీ చేసింది.








కామెంట్‌లు (0)