ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి ఈ నెల 9వ తేదీ నాటికి మూడేళ్లయ్యిందని పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ వెల్లడించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబును అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేసి రోడ్డు మార్గంలో కోర్టుకు తీసుకెళ్లారన్నారు. 53 రోజుల పాటు అక్రమంగా జైల్లో బంధించారన్నారు. ఈ సందర్భంగా బుధవారం ‘నిజం గెలిచింది’ పేరుతో పార్టీ కార్యాలయాలు, ఇళ్లు, బూత్ స్థాయిలో 53 దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. అక్రమ అరెస్టును బ్లాక్ డేగా పాటించాలని సూచించారు. ఏ తప్పూ చేయలేదు కాబట్టే క్లీన్ చిట్ లభించిందన్నారు. ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నాయకులు, కార్యకర్తలను కోరారు.
Print Editionనేడు ‘నిజం గెలిచింది’ కార్యక్రమాలు : నారా లోకేష్
12 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 11:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)