గురువారం, 06 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవారి ఆగడాలు అడ్డుకోవడానికి... 2 నిమిషాలు చాలు

2 గంటల క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 11:50 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు

  • వాళ్లకు అసలు రిజర్వేషన్లు గురించి తెలుసా

  • కోర్టులు మొట్టికాయలు వేసినా యాగీ చేస్తున్నారు

  • సహచర మంత్రులతో చంద్రబాబు

​ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ‘ ప్రతిపక్ష పార్టీ నేత జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి , ఆ పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలను అడ్డుకోవడానికి నాకు రెండు నిమిషాలు చాలు’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం అయన సహచర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జగన్‌‌మోహన్‌ రెడ్డి చేస్తున్న పర్యటన అంశం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం జగన్‌ ‌పరామర్శలంటే జనం భయపడుతున్నారని కొందరు మంత్రులు వ్యాఖ్యానించడంతో స్పందించిన సిఎం ‘వారంతా రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారు. అటువంటి పోకడలను ఉపేక్షించరాదు’ అని అన్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘పొగాకు పేరుతో జరిపిన పర్యటనలో ఒక మహిళ దుకాణాన్ని ఎలా ధ్వంసం చేసారో చూశాం. అక్కడకు పరామర్శకు వెళ్ళి చివరకు రైతులు తెచ్చిన పొగాకును కూడా ధ్వంసం చేశారు. దీనిపై అనేకమంది రైతులు నేరుగా నాకే మెసేజ్‌‌లు పెట్టారు. పంట దెబ్బతిందని వాళ్లు చెబుతున్నారు.’ అని సిఎం అన్నారు.

డిఎస్‌సి పై ఆ పార్టీ నేతలు చేస్తున్న యాగీ కూడా అందరు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై అన్ని విషయాలను ప్రజలకు వివరించామని చెప్పారు. ఇదే అంశంపై వైసిపి వ్యక్తులు కోర్టులకు వెళ్తే అక్కడ కూడా చీవాట్లు తిన్నారని గుర్తుచేశారు. అయినా వాళ్ళు ధర్నాలు అంటూ వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. దీనిని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. ‘వారికి రిజర్వేషన్లు గురించి ఏమాత్రం తెలియదు. డిఎస్‌‌సిపై ఇప్పుడు ధర్నాలు చేయడం ఏంటి’ అని ఆయన ప్రశ్నించారు. హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లు గురించి వైసిపి పార్టీకి, ప్రజలకు చెప్పాలని మంత్రులకు స్పష్టం చేసారు.

నెలాఖరుకు వెలుగొండ ..

నెలాఖరుకు వెలుగొండ ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తామని, ప్రకాశం జిల్లా ప్రజలకు మంచినీటి కోసం నీళ్లు ఇస్తామని చెప్పారు. ఎల్ నినో గురించి మీరు ప్రజలకు తెలియజేస్తూ ఇంత వర్షాభావం ఉన్నా కూడా మంచినీటికి కూడా నీళ్లు ఇస్తున్నామన్నది ప్రజలకు చెప్పాలని మంత్రులను ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్చవం ఉత్తరాంధ్ర ప్రజలలో మంచి సెంటిమెంట్ను తీసుకువచ్చిందని, ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రులు వ్యాఖ్యానించారు. కాగా స్వర్ణాంధ్ర, వికసిత భారత్‌ అంశాలు కలిపి స్వాతంత్య దినోత్చవం ప్రసంగాలలో ఉండాలని చంద్రబాబు సూచించారు. క్వాంటం వ్యాలీ కూడా జనవరిలో ప్రారంభమవుతుందని చెప్పారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్