ప్రజాశక్తి- కృష్ణా జిల్లా : పుల్లేరులో గల్లంతైన విద్యార్థులు నీటిలో మునిగి మరణించారు. ఈ ఘటన ఆదివారం ఉదయం పామర్రు మూల మలుపుల సమీపంలోని నిమ్మ తోట ప్రాంతంలో జరిగింది. గల్లంతైన వీరికోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కౌశిక్ (6వ తరగతి), అమరేంద్ర (8వ తరగతి)తో పాటు ఆరుగురు స్నేహితులు సరదాగా పుల్లేరులో స్నానానికి దిగారు. పుల్లేరు మధ్యలోకి వెళ్లే ప్రయత్నంలో కౌశిక్, అమరేంద్ర ఇద్దరూ నీటిలో మునిగిపోయి మరణించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఆరుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
పుల్లేరులో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతి
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 15, 2026, 03:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)