శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌కు రెండు టెండర్ కమిటీల ఏర్పాటు

1 గంట క్రితం

swatchap
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 08:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్వచ్ఛ భారత్ మిషన్ (పట్టణ) 2.0 కింద చేపట్టే ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ పనులు, కొనుగోలు ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌ ‌కుమార్‌ ‌శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టెండర్ టెక్నికల్ కమిటీ, టెండర్ ఆమోద కమిటీలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద చేపట్టే అన్ని ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ పనులు, కొనుగోలు ప్రక్రియలకు ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయి. టెండర్ టెక్నికల్ కమిటీకి పబ్లిక్ హెల్త్ ఇంజినీర్-ఇన్-చీఫ్ ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా, ఘన వ్యర్థాల నిర్వహణ విభాగం జాయింట్ డైరెక్టర్, ఏపీయూఎఫ్‌ఐడీసీ చీఫ్ ఇంజినీర్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్, సాంకేతిక నిపుణుడు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ టెండర్ పత్రాలను పరిశీలించడం, సాంకేతిక అర్హతల ఆధారంగా బిడ్లను మూల్యాంకనం చేసి ధరల బిడ్లను టెండర్ ఆమోద కమిటీకి పంపుతుంది. టెండర్ ఆమోద కమిటీకి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. పబ్లిక్ హెల్త్ ఇంజినీర్-ఇన్-చీఫ్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్, ఆర్థిక, పరిపాలనా అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ టెండర్లకు తుది ఆమోదం తెలపనుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్