- మాజీ సిఎం వైఎస్ జగన్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘ఒక్క టీచర్ పోస్ట్.డి ఎస్సి స్కాంలో అపరిమిత మెలికలు, మలుపులు’ అని మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విమర్శించారు. కర్నూలు జిల్లాలో ఈడిగ ప్రభాకర్ అనే అభ్యర్థి ఏ పరీక్ష రాయలేదని, అయినా స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగం ఇచ్చారని ఆదివారం సామాజిక మాధ్యమంలో పొందుపరిచారు. ‘అయ్యా, చంద్రబాబుగారు, డిఎస్సిపై ప్రభుత్వం పదే పదే మారుస్తూ ఇస్తున్న వివరణలు, సమాధానాలు.. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ అభ్యర్థుల్లో మరిన్ని ప్రశ్నలకు తావునిస్తున్నాయ’ అని పేర్కొన్నారు. ఉదాహరణకు కర్నూలు జిల్లాలో ఈడిగ ప్రభాకర్ విషయమే తీసుకుంటే.. డీఎస్సీ స్కామ్‌లో ఎన్ని మెలికలు, మలుపులు ఉన్నాయో తేటతెల్లమవుతుందని పేర్కొన్నారు. ఏడు దశల సర్టిఫికెట్ వెరిఫికేషన్ అంటూ ట్విస్ట్‌ల రూపంలో జగన్ వివరించారు. టెట్‌లో 75 మార్కులకు ప్రభాకర్‌కు 65 మార్కులు వచ్చినా చక్కగా టీచర్ ఉద్యోగం ఇచ్చారని, అది కూడా ఏడు దశల సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత అని విమర్శించారు. అతడు అనర్హుడని స్వయంగా జిల్లా విద్యాశాఖ అధికారి ధృవీకరించారని, మరి ఏడుదశల సర్టిఫికెట్‌లో ఏం తెలుసుకున్నారని ప్రశ్నించారు. తనకు టీచర్ ఉద్యోగం వచ్చిందని, కానీ, ఎలా వచ్చిందో నిజంగా తనకు తెలియదని స్వయంగా ఆ అభ్యర్థి చెప్పడం ఇక్కడ కొసమెరుపు అని పేర్కొన్నారు. 2018 టెట్‌లో అతడు 77 మార్కులు సాధించాడని హఠాత్తుగా అధికారుల వెల్లడించారని తెలిపారు. అదే నిజమైతే వాటిని అంతకు ముందు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ప్రశ్నించారు.








కామెంట్‌లు (0)