ప్రజాశక్తి - తిరుపతి : తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని భారత ఉపరాష్ట్రపతి సిపి.రాధాకృష్ణన్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, టిటిడి ఇఒ ముద్దాడ రవిచంద్ర, జెఇఒ డాక్టర్ ఎ.శరత్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి సంప్రదాయ వస్త్రధారణలో ధ్వజస్తంభాన్ని, పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో టిటిడి ఇఒ ముద్దాడ రవిచంద్ర అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట టిటిడి బోర్డు సభ్యులు రాంమూర్తి, డాలర్ దివాకర్ రెడ్డి, సివిఎస్‌ఒ కె.వి.మురళీకృష్ణ, జిల్లా ఎస్‌పి ఎల్.సుబ్బరాయుడు, విజిఒ గిరిధర, డిప్యూటీ ఇఒలు హరీంద్రనాథ్, సెల్వం, ఎఇఒ దేవరాజులు, ఎవిఎస్‌ఒలు శ్రీహరి రావు, జి.చంద్ర, సూపరింటెండెంట్లు మునిచంగల్రాయులు, సురేష్, ఇతర అధికారులు, అర్చకులు ఉన్నారు.










కామెంట్‌లు (0)