ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్ధి మిత్ర కిట్లు ఇంకా పూర్తిస్థాయిలో అందలేదు. ప్రభుత్వ పాఠశాలలు తెరిచే నాటికే పంపిణీ పూర్తిచేయాల్సి ఉంది. పాఠశాలలు తెరిచి రెండు నెలలు పూర్తవుతున్నా సరఫరా ఇంకా పెండింగ్‌లోనే ఉంది. పశ్చిమదేశాల్లో జరుగుతున్న యుద్దం వల్ల కిట్లను ఒక నెల ఆలస్యంగా పంపిణీ చేస్తామని పాఠశాల విద్యాశాఖ ముందుగానే తెలిపింది. చెప్పిన గడువు ముగిసినా పంపిణీని పూర్తి చేయలేకపోయింది. పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, మూడు జతల యునిఫాం, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, బ్యాగ్‌తో పాటు 1వ తరగతి విద్యార్ధులకు పిక్టోరియల్ డిక్షనరీ, 6వ తరగతి విద్యార్ధులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ అందించాల్సి ఉంది. ప్రభుత్వ, అనుబంధ పాఠశాలల్లో సుమారు 32లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు సరఫరా పూర్తిస్థాయిలో జరిగింది. బూట్లు, బ్యాగ్, యునిఫాం సరఫరా మాత్రం పూర్తికాలేదు. బ్యాగులు ఇంకా 40శాతం, యునిఫాం 15శాతం, బూట్లు 15శాతం చొప్పున ఇంకా పంపిణీ జరగాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నెల 24వ తేదిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే లోపు వీటి పంపిణీ పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
విద్యామిత్ర కిట్లు ఇంకా పెండింగే బ్యాగ్,షూ, యునిఫాం ఆలస్యం
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 19, 2026, 10:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)