శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆహార భద్రత చట్టం అమలుకు విజిలెన్స్‌ కమిటీలు

21 గంటల క్రితం

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 12:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రత చట్టం–2013 అమలును పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా, మండల, చౌకధరల దుకాణాల స్థాయిలో విజిలెన్స్‌ కమిటీలను రెండు నెలల్లో ఏర్పాటుచేసి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లీసా గిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కమిటీల ఏర్పాటు, వాటి పనితీరుపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను ముగించింది.

జాతీయ ఆహార భద్రత చట్టం నిబంధనలకు అనుగుణంగా పథకాల అమలును పర్యవేక్షించేందుకు వివిధ స్థాయిల్లో విజిలెన్స్‌ కమిటీలు ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ హెల్ప్‌ ది పీపుల్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ ట్రస్టీ కీతినీడి అఖిల్‌ శ్రీ గురుతేజ పిల్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. పై విధంగా ఆదేశాలిచ్చింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్