ప్రజాశక్తి - ఎన్‌టిఆర్ : కృష్ణాజిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ (విజయ డెయిరీ) నూతన ఛైర్మన్ దాసరి వెంకట బాలవర్ధనరావుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను మిల్క్ డైరెక్టర్ పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించినట్లు సమాచారం. ఈ తీర్పుతో విజయ డెయిరీ ఛైర్మన్ పదవిలో ఆయన కొనసాగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. డైరెక్టర్ పదవికి అనర్హత వేటు పడటంతో ఛైర్మన్ పదవికి కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. విజయ డెయిరీ రాజకీయాల్లో ఈ పరిణామం ఎలాంటి మలుపు తీసుకోనుందనేది ఆసక్తికరంగా మారింది.
విజయ డెయిరీ నూతన ఛైర్మన్ దాసరి వెంకట బాలవర్ధనరావుకు చుక్కెదురు!
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 16, 2026, 04:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)