బుధవారం, 08 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పట్టిసీమ నుంచి నీరు విడుదల

2 గంటల క్రితం

Water released from Pattiseema
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 11:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఏలూరు : పట్టిసీమ నుంచి నీరు నేడు విడుదలయింది.బుధవారం మంత్రి నిమ్మల రామానాయుడు పట్టిసీమ, తాడి పూడి ఎత్తిపోతల పథకాల మోటార్లను ఆన్ చేసి పోలవరం కుడి కాలవలోకి నీటిని విడుదల చేశారు. రాత్రి పోలవరం దగ్గర గోదావరికి 50 వేల క్యూసెక్కులతో వరద ప్రవాహం చేరింది. గోదావరి డెల్టాకు ఈస్టర్న్ కెనాల్, వెస్టర్న్ కెనాల్, సెంట్రల్ కెనాల్ కు పూర్తి సామర్ద్యంతో 15,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. కృష్ణా డెల్టాకు... ఎగువ నుండి వచ్చే వరద నీరు ధవళేశ్వరం నుండి ఓవర్ ఫ్లో అవ్వకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం, తుంగభద్ర, నాగార్జున సాగర్ కృష్ణా ఎగువ ప్రాజెక్టులలో అందుబాటులో నీరు లేదని... పట్టి సీమ నుంచి నీరు విడుదల చేయడంతో కృష్ణా డెల్టా ఈస్ట్, వెస్ట్ కెనాల్ ఆయకట్టు రైతులకు సాగునీరు అందుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2014-19లో రూ.1300 కోట్లతో నిర్మించిన పట్టిసీమ.. నేడు రూ.50 వేల కోట్ల ఆదాయం సృష్టించిందన్నారు. ఎత్తిపోతల పథకాన్ని గొడ్డలి పార్టీ వట్టిసీమ అని విమర్శించదని, ఇప్పుడు అదే పథకం ద్వారా ఇప్పటివరకు 450 టీఎంసీలు తరలించామని, దీనికి జగన్‌ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కర్నాటకలో ఆలమట్టి నుంచి నాగార్జునసాగర్‌ వరకు పాజెక్టులు డెడ్‌స్టోరేజీలో ఉన్నాయని, గోదావరికి ఎగువ నుంచి వస్తున్న నీరు సముద్రంలోకి పోకుండా ఒడిసిపట్టుకుని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పోలవరం, కొవ్వూరు, గోపాలపురం ఎమ్మెల్యేలు సిరి బాలరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి ధర్మరాజు, కలెక్టర్‌ వెట్రిసెల్వి తదిరుతుల పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్