పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల ద్వారా నీటి విడుదల
ప్రజాశక్తి - తాళ్లపూడి / పోలవరం : సూపర్ ఎల్‌నినోను సమర్ధంగా ఎదుర్కొ నేందుకు_ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ముందస్తు ప్రణాళికలతో ప్రతి నీటి బొట్టునూ సమర్ధంగా వినియోగించుకుంటామ న్నారు. ఏలూరు జిల్లాలోని పట్టిసీమ, తూర్పుగోదావరి జిల్లాలోని తాడిపూడి ఎత్తిపోతల నుంచి బుధవారం ఆయన నీరు విడుదల చేశారు. పట్టిసీమ డెలివరీ పాయింట్, తాడిపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు దగ్గర గోదావరికి మంత్రి జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ..70 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే జులై ఐదో తేదీకి గోదావరికి ఇన్‌ఫ్లో లేకపోవడం ఇదే మొదటిసారి అని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారన్నారు. మంగళవారం 56 వేల క్యూసెక్కులు నీరు వచ్చిందని, ఈ నీటిలో 8,000 క్యూసెక్కులను ప్రతిరోజు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు పంపుతామని, తొలుత తాగునీటికి, ఆ తరువాత సాగునీటికి_ ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు గోదావరి వృధా జలాలను కృష్ణా డెల్టాకు తరలిం చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పట్టిసీమ ఎత్తిపో తల పథకం సత్ఫలితాలనిచ్చిందన్నారు. కేవలం రూ.1300 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన పట్టి సీమ ద్వారా సాగునీటిని అందించి రూ.వేల కోట్ల పంటలను సాధించామని వివరిం చారు. నాడు పట్టిసీమ వట్టిసీమ అన్న జగన్, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇప్పటివరకు పట్టిసీమ ద్వారా 442కు పైగా టిఎంసిల నీటిని కృష్ణా డెల్టాకు తరలించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు,_ మద్దిపాటి వెంకటరాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, ఆర్‌డిఒ ఎంవి.రమణ, ఎపి సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మురాల సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)