- రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరవు పరిస్థితుల నేపథ్యంలో సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 26న విజయవాడలో నిర్వహించనున్న అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాల్సిందిగా సిపిఎంను ఆ పార్టీ ఆహ్వానించింది. విజయవాడలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ్‌రెడ్డి, అక్కినేని వనజతో కూడిన ప్రతినిధి బృందం, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం, డి.రమాదేవి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వర రావు, బి.బలరామ్‌లను గురువారం కలిసినట్లు వెల్లడించింది. రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించిన ఆహ్వానాన్ని అందజేసినట్లు తెలిపింది.







కామెంట్‌లు (0)