సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

27న 'చలో విజయవాడ`

2 రోజుల క్రితం

27న 'చలో విజయవాడ` image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 08:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి - గోపాలపురం : చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్ జి ఎస్ డబ్ల్యూ ఉద్యోగులు పిలుపునిచ్చారు. శుక్రవారం దీనికి సంబంధించిన ఇన్ ఛార్జి ఎంపిడిఒ కెఎం.మంగతాయారుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్.జిఎస్.డబ్ల్యూ ఉద్యోగులు విలేకరులతో మాట్లాడారు. మండలంలో ప్రభుత్వ ఎస్.జిఎస్.డబ్ల్యు ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 27న విజయవాడలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రెండేళ్ల ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని, ఎఎఎస్ ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీం అమలు చేయాలని, 9 నెలల వేత బకాయిలకు సంబంధించిన ఎరియర్స్ చెల్లించాలని, ఆలస్యమైన కాలానికి ప్రత్యేక ఇంక్రిమెంట్, కనీస మూల వేతనం రూ.30వేలు చేయాలని, జిఒ 11 రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈ కార్యకమాన్ని చేపట్టామన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్