బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విషాదంలోనూ మానవత్వం

25 సెప్టెంబర్, 2026

విషాదంలోనూ మానవత్వం
- అవయవదానంతో పలువురికి పునర్జన్మ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 09:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- అవయవదానంతో పలువురికి పునర్జన్మ

ప్రజాశక్తి - ఒంగోలు సిటీ : కుటుంబంలో తీరని విషాదం నెలకొన్న వేళలోనూ.. ఇతర కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ఆ కుటుంబ సభ్యులు తీసుకున్న మానవతా నిర్ణయం పలువురికి ఆదర్శంగా నిలిచింది. బ్రెయిన్‌స్టెమ్‌ హెమరేజ్‌తో బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారణైన మాజీ సిఆర్‌పిఎఫ్‌ ఉద్యోగి అదిములపు దయాళు (55) అవయవాలను దానం చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. దీంతో పలువురు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అవయవాలు పొందే అవకాశం లభించింది.

మార్కాపురం జిల్లా గజ్జలకొండ గ్రామానికి చెందిన దయాళు అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఒంగోలులోని కిమ్స్‌ హాస్పిటల్స్‌కు తరలించారు. వైద్య పరీక్షల్లో బ్రెయిన్‌స్టెమ్‌ హెమరేజ్‌గా నిర్ధారణ కావడంతో వైద్య బృందం చికిత్స అందించింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిరంతరం పర్యవేక్షించిన వైద్యులు శుక్రవారం నాడు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. అవయవదానం ప్రాధాన్యతను వైద్యులు కుటుంబ సభ్యులకు వివరించారు. తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ.. ఇతరుల ప్రాణాలను కాపాడాలనే మానవతా దృక్పథంతో దయాళు భార్య విజయకుమారి, కుమార్తె అన్సి, సోదరులు చైతన్య, శివమణి దయాళు అవయవదానానికి సమ్మతి తెలిపారు. ఈ సందర్భంగా కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఒంగోలు మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ టి. శ్రీహరి రెడ్డి, ఎమర్జెన్సీ ఫిజీషియన్‌ డా. బాలమురళీకృష్ణ మాట్లాడుతూ... అవయవదానం కేవలం వైద్య ప్రక్రియ కాదని, గొప్ప మానవతా సేవ అని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్