ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం...

30 సెప్టెంబర్, 2026

ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం...
ఆర్టీసి సర్వీసులన్నీ ‘‘పల్లెపండుగ’’ కార్యక్రమానికే... image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 11:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆర్టీసి సర్వీసులన్నీ ‘‘పల్లెపండుగ’’ కార్యక్రమానికే...

ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం

గంటల తరబడి నిరీక్షణ

ప్రజాశక్తి-విజయవాడ : ఆర్టీసి సర్వీసులు అందుబాటులో లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా రాష్ర్ట వ్యాప్తంగా వందలాది ఆర్టీసి సర్వీసులను సిఎం సభలకు మళ్లిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మంగళవారం జరిగిన ‘పల్లెపండుగ 3.0’ కార్యక్రమానికి రాష్ర్ట వ్యాప్తంగా వెయ్యికి పైగా ఆర్టీసి సర్వీసులను ఉపయోగించినట్లు సమాచారం. ఎన్‌‌టిఆర్‌ ‌జిల్లాలోని పలు డిపోల పరిధిలో 220 ఆర్టీసి సర్వీసులను ఉపయోగించగా, ఒక్క విజయవాడ నగర పరిధిలోనే 170 సర్వీసులను పల్లెపండగ కార్యక్రమానికి పంపినట్లు తెలిసింది. బుధవారం విజయవాడలో జరిగిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమానికి ఆర్‌‌టిసి బస్సులను ఉపయోగించారు. ఎన్‌‌టిఆర్‌ జిల్లాలో మొత్తం 657 సర్వీసులు, అలాగే విజయవాడ సిటీలో 270 ఆర్టీసి సర్వీసులు ఉన్నాయి. రోజుల తరబడి ఆర్టీసి సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గంటల తరబడి డిపోల్లోనే ప్రయాణికులు ఉండిపోయి, సర్వీసుల కోసం నిరీక్షించక తప్పలేదు. కళ్లు కాయలు కాచేటట్లు ఎంత సేపు ఎదురు చూసినా అందుబాటులో లేకపోవడంతో ఉసూరుమంటూ, ఎక్కువ ఛార్జీలు వెచ్చించి ప్రయివేటు సర్వీసుల్లో ప్రయాణికులు వెళ్లిపోవాల్సి వచ్చింది. విజయవాడ పిఎన్‌ ‌బస్‌‌స్టేషన్‌ ‌ఫ్లాట్‌‌ఫారాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. అలాగే జిల్లాలోని ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు తదితర ప్రాంతాలతోపాటు గుంటూరు, మంగళగిరి, రేపల్లె తదితర గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు గంటల తరబడి పిఎన్‌ ‌బస్‌‌స్టేషన్‌‌లోనే సర్వీసుల కోసం నిరీక్షించారు. సిటీ పరిధిలోని సిటీ టెర్మినల్‌‌తో పాటు బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు బస్‌‌స్టాప్‌‌ల వద్ద ప్రయాణికులు గుంపులు గుంపులుగా ఉండిపోవాల్సి వచ్చింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్