సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తమిళనాడు సీఎం విజయ్‌ కు విజయవాడ ఉత్సవ్‌ కు ఆహ్వానం

6 రోజుల క్రితం

తమిళనాడు సీఎం విజయ్‌ కు విజయవాడ ఉత్సవ్‌ కు ఆహ్వానం... image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 09:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు తిరు. సి. జోసెఫ్ విజయ్‌ ని విజయవాడ ఉత్సవ్‌ కు నరసరావుపేట ఎంపీ, టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీలో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులురెడ్డి, కేశినేని శివనాథ్‌, జీఎంసీ హరీష్‌ బాలయోగి, విజయవాడ ఉత్సవ్‌ కమిటీ చైర్మన్‌ కె.మురళితో కలిసి విజయ్‌ ను కలిశారు. విజయ్‌ తో జరిగిన భేటీ ఆత్మీయంగా సాగిందని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఆయన వినయం, ఆప్యాయత, సౌమ్యత ఆకట్టుకున్నాయని తెలుగు, తమిళ ప్రజల మధ్య ఎంతో కాలంగా కొనసాగుతున్న సాంస్కృతిక అనుబంధాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలుగు, తమిళ భాషలు, సంస్కృతి, సినిమా, కళలు, సంప్రదాయాలు రెండు రాష్ట్రాల ప్రజలను మరింత దగ్గర చేశాయని తెలిపారు. ఈ నేపథ్యంలో విజయవాడ ఉత్సవ్‌ ద్వారా తెలుగు-తమిళ సాంస్కృతిక బంధాన్ని మరింత ఘనంగా చాటిచెప్పే అవకాశం లభిస్తుందన్నారు. విజయ్‌ విజయవాడ ఉత్సవ్‌ లో పాల్గొని తెలుగు-తమిళ సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్