శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతౌషిక్ కేసు తప్పుదోవ పట్టిస్తున్నారు

8 గంటల క్రితం

manda krishna .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 09:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎంపి మాగుంట, ఎమ్మెల్యే ఉగ్రపై మందకృష్ణ మాదిగ ఆరోపణలు

ప్రజాశక్తి – ఒంగోలు సిటీ : తౌషిక్‌ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కట్టుకథలు అల్లి వాస్తవాలను మరుగునపరిచే ప్రయత్నం చేశారని ఎంఆర్‌‌పిఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. విద్యాసంస్థ యాజమాన్యాన్ని కాపాడేందుకు ఎం‌పి మాగుంట శ్రీనివాసులురెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కేసును తప్పుదోవ పట్టిస్తున్నట్లు విమర్శించారు. ఈ ఆరోపణలపై సంబంధిత ప్రజాప్రతినిధులు స్పందించాలని, తౌషిక్‌ మృతి, అతని తల్లి మౌలాబీ మరణంపై సిబిఐతో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఒంగోలు అంబేద్కర్‌ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరాయకొండలోని శ్రీచైతన్య నవోదయ విద్యాసంస్థలో తౌషిక్‌ మృతి ఘటనకు సంబంధించి తమకు లభించిన సిసిటివి దృశ్యాలు, ఇతర సమాచారాన్ని పరిశీలిస్తే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ముఖ్యంగా సాయంత్రం 5.05 గంటల నుంచి 5.40 గంటల మధ్య ఏం జరిగిందో సమగ్రంగా విచారించాలని కోరారు. సిసిటివి ఫుటేజీ మాయమైందన్న ఆరోపణలపైనా దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. వార్డెన్లు బాబ్జీ, ప్రవీణ్‌ కదలికలు, బాలుడి మృతదేహాన్ని తరలించిన తీరుపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రౌడీషీటర్‌ సాయికృష్ణను పరామర్శించిన ముఖ్యమంత్రి.. న్యాయం కోసం ఎదురుచూస్తున్న తౌషిక్ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.

12న కలెక్టరేట్‌ వద్ద ధర్నా....

బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 12న ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు మంద కృష్ణ మాదిగ ప్రకటించారు. సమావేశంలో తౌషిక్‌ తండ్రి సయ్యద్‌ అలీ, ముస్లిం ఫెడరేషన్‌ నాయకులు సుల్తాన్‌, రషీద్‌, విసికె పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణ, సిపిఐ న్యూడెమోక్రసీ నాయకుడు ఆర్‌.మోహన్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు సిహెచ్‌.వినోద్‌, రైతు కూలీ సంఘం నాయకులు కోడూరి, నాంచార్లు, విద్యార్థి జెఎసి రాష్ట్ర నాయకుడు జగదీష్‌, ముస్లిం డెవలప్‌మెంట్‌ సొసైటీ నాయకుడు భాషా తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్