శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగ్రామీణ మహిళలకు ‘హోమ్ ఆయా’ శిక్షణ

7 గంటల క్రితం

kondapalli.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 10:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గ్రామీణ ప్రాంత మహిళలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే అవసరం లేకుండా, వారి స్వగ్రామాలకు సమీపంలోనే గౌరవప్రదమైన జీవనోపాధి, స్థిరమైన ఆదాయం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎంఎస్‌ఎంఇ, గ్రామీణ పేదరిక నిర్మూలనశాఖల మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ తెలిపారు. దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ‘కేర్ ఎకానమీ’ రంగంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు సెర్ప్ ఆధ్వర్యంలో ‘హోమ్ ఆయా – జెరియాట్రిక్ కేర్ టేకర్’ అనే ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. గ్రామీణ స్వ‌యం స‌హాయ‌క సంఘాల మహిళలకు రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌ఎస్‌ఇఐటి) సంస్థల ద్వారా ఉచితంగా వసతి సదుపాయంతో శిక్షణ ఇస్తార‌న్నారు. ఇందులో భాగంగా వయోవృద్ధులు, శయ్యాగత రోగుల సంరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, ప్రథమ చికిత్స, కమ్యూనికేషన్ నైపుణ్యాలపై ప్రత్యక్ష శిక్షణతో పాటు వృద్ధాశ్రమాలు, నర్సింగ్ హోమ్‌లు, శిశు సంరక్షణ కేంద్రాలను సందర్శింపజేసి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తార‌ని తెలిపారు. అలాగే బ్యాంకింగ్, డిజిటల్ లావాదేవీలు, ఆర్థిక నిర్వహణపై మహిళలకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తార‌ని.. జిల్లాలోని డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్ట‌ర్లు ఆస‌క్తి ఉన్న స్వ‌యం స‌హాయ‌క మ‌హిళ‌ల‌ను గుర్తించి వారికి ఆర్‌ఎస్‌ఇఐటి ద్వారా శిక్షణ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్