ప్రజాశక్తి-లేపాక్షి: లేపాక్షి మండల పరిధిలోని కొడికొండ నుంచి శిర వెళ్లే జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలమత్తూరు మండలం కోర్లకుంట గ్రామానికి చెందిన పెద్ద తిమ్మప్ప కుమారుడు శేషాద్రి (25) హిందూపురంలోని మార్కెట్‌లో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. రోజువారీగా కూలీ పనులకు వెళ్లే శేషాద్రి శనివారం ఉదయం కోర్లకుంట నుంచి హిందూపురం బయలుదేరాడు. ఈ క్రమంలో లేపాక్షి సమీపంలోకి రాగానే లారీ ఢీకొనడంతో అదుపుతప్పి కిందపడిపోయాడు. లారీ చక్రాలు అతడి తలపై నుంచి వెళ్లడంతో శేషాద్రి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నరేంద్ర సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన లారీని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
లారీ ఢీకొని యువకుడు మృతి
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 12:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)