న్యూఢిల్లీ : ఎపిలో స్థానిక ఎన్నికలపై వైఎస్‌ఆర్‌సిపి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. వార్డుల విభజన, స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా రాష్ట్ర హైకోర్టు ఈనెల 1న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై వైఎస్‌ఆర్‌సిపి పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ప్రతివాదిగా చేర్చింది.
పిటిషన్ దాఖలు చేసిన వెంటనే వైఎస్‌ఆర్‌సిపి తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజెఐ సూర్యకాంత్ వద్ద ప్రస్తావించారు. ఇదే తీర్పుపై మరో పిటిషన్ కూడా దాఖలైందని ధర్మాసనం పేర్కొంది. ఆ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశముందని తెలిపింది. ఏ క్షణంలో అయినా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని, తమ పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాలని వైఎస్‌ఆర్‌సిపి న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు.








కామెంట్‌లు (0)