mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమ‌రావ‌తిలో 18 ఎక‌రాల‌లో సెంట్రల్ న‌ర్స‌రీ

2 రోజుల క్రితం

amaravti
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 18, 2026, 01:06 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - తుళ్లూరు : ​రాజధాని అమరావతిలో ప్రధాన రహదారులకు ఇరువైపుల పచ్చదనాన్ని పెంచేందుకు 45 వేల మొక్కలు నాటాలని ఎడిసి లక్ష్యంగా పెట్టుకుందని అమరావతి అభివృద్ధి సంస్థ చైర్‌ప‌ర్స‌న్, మేనేజింగ్ డైరెక్ట‌ర్ డి ల‌క్ష్మీపార్థ‌సారథి చెప్పారు. రాజధాని అమ‌రావ‌తిలోని లింగాయ‌పాలెం - ఉద్ధండ‌రాయునిపాలెం గ్రామాల మ‌ధ్య సెంట్ర‌ల్ న‌ర్స‌రీలో బుధవారం మొక్క‌లు నాటి అభివృద్ధి ప‌నుల‌ను పున: ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్థసారథి మాట్లాడుతూ రాజ‌ధానిలో 18 ఎక‌రాల‌కుగాను తొలుత పది ఎక‌రాల‌లో ప‌నుల‌ను చేప‌డతామని తెలిపారు. దశల వారీగా మిగిలిన విస్తీర్ణంలోనూ న‌ర్స‌రీని అభివృద్ధి చేస్తామన్నారు. సెంట్ర‌ల్ న‌ర్స‌రీని ఉద్యాన‌ విభాగం ప్ర‌ధాన స్టాక్ పాయింట్‌గా వినియోగిస్తామని, రాజ‌ధాని రోడ్ల‌పై చెట్ల పెంపకానికి అవ‌స‌ర‌మైన మొక్క‌ల‌ను ఇక్క‌డి నుంచి ర‌వాణా చేస్తారని తెలిపారు. ప్ర‌భుత్వం నిర్మిస్తున్న 34 ప్ర‌ధాన ర‌హ‌దార్ల‌కు ఇరువైపులా సుమారు 700 కిలోమీటర్ల మేర చెట్లు పెంచి మంచి గాలి, నీడ అందించాలనేదే ప్ర‌ధాన ల‌క్ష్యమని తెలిపారు. సంబంధిత అధికారులు మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతల నుండి మొక్క‌లను సంరక్షించడానికి ఉష్ణ దుప్ప‌టి లాగా స‌రిప‌డే వెచ్చదనాన్ని అందించ‌డానికి గ్రీన్ హౌస్‌ను కూడా నిర్మిస్తారని చెప్పారు. కార్య‌క్ర‌మంలో ఎడిసి ఉధ్యాన‌వ‌న‌, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్