మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

స్పెయిన్‌లో కనిపించిన సంపూర్ణ సూర్యగ్రహణం

5 రోజుల క్రితం

spian
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 11:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఆకాశంలో అరుదైన ఖగోళ అద్భుతం

మాడ్రిడ్ : స్పెయిన్‌లోని శాన్ మిలాన్ డి లాస్ కాబల్లెరోస్ నుంచి బుధవారం సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేసింది. ఆకాశంలో అరుదైన ఖగోళ అద్భుతం ఆవిష్కృతం కావడంతో ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. చంద్రుడు సూర్యుడు, భూమి మధ్యకు వచ్చి సూర్యుడి కాంతిని పూర్తిగా అడ్డుకున్నప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యుడి ముఖం పూర్తిగా చంద్రుడి వెనుకకు వెళ్లిపోతుంది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం గ్రీన్‌ల్యాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, అట్లాంటిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాలు, స్పెయిన్‌తో పాటు పోర్చుగల్‌లోని స్వల్ప ప్రాంతం నుంచి కనిపించింది. అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, కెనడాలోని చాలా భాగం, ఐరోపాలోని అధిక భాగం, వాయువ్య ఆఫ్రికాలో మాత్రం పాక్షిక సూర్యగ్రహణం కనిపించింది. సంపూర్ణ గ్రహణం కనిపించిన ప్రాంతాల్లో ప్రజలు ప్రత్యేక కళ్లద్దాలు, ఇతర భద్రతా పరికరాలను ఉపయోగిస్తూ ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్