గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. కాంటాక్ట్స్ కోసం ప్రత్యేక ట్యాబ్!

1 గంట క్రితం

whata
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 10:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

వాట్సాప్ యూజర్ల కోసం మెటా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. యూజర్లు తమ కాంటాక్ట్స్‌ను సులభంగా వెతికి, నిర్వహించుకునేలా ప్రత్యేకంగా ‘Contacts Tab’ను అందుబాటులోకి తీసుకురావడానికి వాట్సాప్ పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త ట్యాబ్‌లో కాంటాక్ట్స్‌తో పాటు ఆన్‌లైన్‌లో ఉన్నవారు, పుట్టినరోజు రిమైండర్లు వంటి వివరాలను ఒకే చోట చూసే అవకాశం ఉండనుంది.

టెక్ న్యూస్ వెబ్‌సైట్ WABetaInfo నివేదిక ప్రకారం.. ఆండ్రాయిడ్ యాప్ కోసం వాట్సాప్ ప్రస్తుతం ఈ కొత్త Contacts Tabను అభివృద్ధి చేస్తోంది. అయితే ఇది ఇంకా డెవలప్‌మెంట్ దశలోనే ఉంది. ప్రస్తుతం బీటా టెస్టర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రాలేదు.

కొత్త Contacts Tabలో వాట్సాప్ కాంటాక్ట్స్ అన్నింటినీ ఒకే స్క్రీన్‌పై చూడొచ్చని తెలుస్తోంది. ఇందులో పైభాగంలో ప్రత్యేకమైన Search Bar ఉంటుంది. పేరు, ఫోన్ నంబర్ లేదా యూజర్‌నేమ్ ఆధారంగా కాంటాక్ట్‌ను త్వరగా వెతకవచ్చు. అలాగే కాంటాక్ట్‌లను యూజర్లు తమకు నచ్చిన విధంగా అమర్చుకునే అవకాశం కూడా ఉండొచ్చు.

Activity ఆప్షన్‌ను ఎంచుకుంటే ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఉన్న కాంటాక్ట్స్ ముందుగా కనిపించే అవకాశం ఉంది. Alphabetical ఆప్షన్‌ను ఎంచుకుంటే పేర్ల అక్షరక్రమం ఆధారంగా కాంటాక్ట్స్ కనిపిస్తాయి.

ఈ ట్యాబ్‌లో కాంటాక్ట్ ప్రొఫైల్ ఫొటో పక్కన గ్రీన్ డాట్ కనిపించే అవకాశం ఉంది. దీని ద్వారా ఆ వ్యక్తి ప్రస్తుతం వాట్సాప్‌లో ఆన్‌లైన్‌లో ఉన్నారా లేదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. అయితే ఇది పూర్తిగా యూజర్ ప్రైవసీ సెట్టింగ్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఎవరైనా తమ Online Statusను ఇతరులకు కనిపించకుండా సెట్ చేసుకుంటే వారి ప్రొఫైల్‌పై గ్రీన్ డాట్ కనిపించదు.

అలాగే Last Seen స్టేటస్‌ను దాచిన కాంటాక్ట్స్‌ను వారి ఇటీవలి యాక్టివిటీ ఆధారంగా గుర్తించే అవకాశం కూడా ఉండదు. అంటే వాట్సాప్‌లో ఇప్పటికే ఉన్న ప్రైవసీ నియమాలనే కొత్త Contacts Tab కూడా అనుసరించనుంది.

ఇక ఈ కొత్త ట్యాబ్‌లో Birthday Reminders కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒక కాంటాక్ట్‌కు ఆ రోజు పుట్టినరోజు ఉంటే.. వారి పేరుతో పాటు కేక్ ఎమోజీ, “Birthday today” అనే లేబుల్ కనిపించవచ్చు. దీంతో ప్రత్యేకంగా వారి చాట్‌ను వెతకాల్సిన అవసరం లేకుండానే Contacts Tab నుంచే బర్త్‌డే విషెస్ పంపేందుకు చాట్‌ను ప్రారంభించవచ్చు.

కాంటాక్ట్స్‌తో పాటు Meta AI, Invite a Friend వంటి షార్ట్‌కట్స్ కూడా ఈ ట్యాబ్‌లో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. Contacts లిస్ట్ కింద Meta AIను యాక్సెస్ చేసేందుకు లింక్ ఉండొచ్చు. అలాగే ‘Invite a Friend’ ఆప్షన్ ద్వారా ఇంకా వాట్సాప్ ఉపయోగించని వారికి ఆహ్వాన లింక్‌ను పంపవచ్చు.

ప్రస్తుతం ఈ Contacts Tab ఫీచర్ ఆండ్రాయిడ్ కోసం అభివృద్ధి దశలోనే ఉంది. బీటా వెర్షన్‌లో కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. భవిష్యత్తులో వాట్సాప్ విడుదల చేసే అప్‌డేట్ ద్వారా ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక విడుదల తేదీపై మెటా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్