ప్రజాశక్తి - హైదరాబాద్ : రాష్ర్టంలో తొలిసారిగా నిర్వహించిన తెలంగాణ ప్రీమియర్ టిజి20 లీగ్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టుకు రామోజీ ఫిల్మ్ సిటీలో ఘన సన్మానం నిర్వహించారు. జట్టుకు తెలంగాణ సంప్రదాయ స్వాగతం పలికిన అనంతరం ఆటగాళ్లు రామోజీ ఫిల్మ్ సిటీలోని ప్రముఖ ఆకర్షణలను సందర్శించారు. ట్రోఫీతో ప్రత్యేక ఫోటో సెషన్, అభిమానులతో ముఖాముఖి, సన్మాన కార్యక్రమం ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ అభిరత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ర్టంలోని తొలి టిజి20 టైటిల్‌ను గెలవడం గర్వకారణమని అన్నారు. టోర్నీ అంతటా తమకు అండగా నిలిచిన ఫ్రాంచైజీకి కృతజ్ఞతలు తెలిపారు. అద్భుతమైన విజయోత్సవాన్ని నిర్వహించి తమను రామోజీ కుటుంబంలో భాగస్వాములను చేసినందుకు రామోజీ ఫిల్మ్ సిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు ఆటగాళ్లు, ఫ్రాంచైజీ ప్రతినిధులు, రామోజీ ఫిల్మ్‌సిటీ అధికారులు, అభిమానులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)