మంగళవారం, 07 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కరూర్‌ తొక్కిసలాట కేసు : డిఎంకె పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

10 గంటల క్రితం

Supreme Court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 01:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : కరూర్‌ తొక్కిసలాట కేసులో డిఎంకె పిటిషన్‌ విచారణకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. టివికె నిందితులు సాక్ష్యులను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారన్న డిఎంకె ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆర్‌.ఎస్‌.భారతి పిటిషన్‌ను విచారణకు జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌, జస్టిస్‌ అలోక్‌ అరథేలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ‘‘అభ్యర్థి తరపున సీనియర్‌ న్యాయవాది రంజిత్‌ కుమార్‌ వాదనలను విన్నాము. అందుబాటులో ఉన్న ఇతరపరిష్కార మార్గాలను అనుసరించడానికి ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. ఈ నిబంధనల ప్రకారం.. ఉపసంహరించుకున్న దరఖాస్తుగా ఈ పిటిషన్‌న కొట్టివేస్తున్నాము’’ అని ధర్మాసనం పేర్కొంది.

కరూర్‌ ఘటనపై దర్యాప్తును ఇప్పటికే సిబిఐకి బదిలీ చేసిన తర్వాత, బహిరంగ ప్రకటనలు, ఇతర చర్యలపై ఆంక్ష‍లు విధించాలని కోరుతూ రాజకీయ ప్రత్యర్థి దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు ఎలా పరిగణనలోకి తీసుకుంటుందని విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్