సుప్రీం కోర్టు సూచలను అమలు చేయాలి...
స్థానిక సంస్థల బలోపేతానికి సిపిఎం, అది బలపరిచే వామపక్ష లౌకిక శక్తులను గెలిపించాలి
విజయవాడ : స్థానిక ఎన్నికలను ఫార్సుగా మార్చొద్దని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నామినేషన్లు వేయనీయకుండా బెదిరించడం, దాడులు చేయడం, కిడ్నాపులకు పాల్పడటం బలవంతంగా పేపర్లు చించేయడం వంటి చర్యలతో అధికార పార్టీ ఏకపక్షంగా నియంతృత్వంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడే ఈ అక్రమ పద్దతులను ప్రోత్సహించారని ఆరోపించారు. ప్రజల నమ్మకాలపై కాకుండా దౌర్జన్య పద్దతులు అనుసరించారని విమర్శించారు. కొన్ని చోట్ల సిపిఎం అభ్యర్థులపైనా దాడులకు పాల్పడ్డారని అన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని, ఎన్నికల సంఘం తక్షణం జోక్యం చేసుకుని సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అనుసరించి అక్రమాలు జరిగిన చోట నామినేషన్లు వేయడానికి తిరిగి అవకాశం కల్పించాలని సిపిఎం తరుపున డిమాండు చేశారు. బుధవారం విజయవాడలోని బాలోత్సవ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, డి.రమాదేవితో కలిసి శ్రీనివాసరావు మాట్లాడారు.
స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయనీయకుండా అధికారపార్టీ నాయకులు దౌర్జన్యాలకు దాడులకు పాల్పడ్డారని అన్నారు. పోలీసులు కూడా వారికి వత్తాసు పలికారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకగ్రీవం అయ్యామని ప్రచారం చేసుకుంటున్న అధికార పార్టీ నామినేషన్లు వేయనీయకుండా ఎందుకు దాడులు చేసిందని ప్రశ్నించారు. ఏకగ్రీవాలన్నీ బలవంతంగా చేశారని, ఇదేమి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. గతంలో వైసిపి ఎటువంటి పనిచేసిందో ఇప్పుడు టిడిపి కూడా అటువంటి పనే చేస్తోందని గుర్తు చేశారు. ఏకపక్షంగా వ్యవహరించినందుకే సాధారణ ఎన్నికల్లో వైసిపిని ఇంటికి పంపించారని, కూటమికి అదే గతి పడుతుందని హెచ్చరించారు. ఇటువంటి పరిస్థితిని ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు. దాడులు దౌర్జన్యాలతో కాదని, ప్రజాభిప్రాయంతో గెలిచిన వారే నిజమైన రాజకీయ నాయకులని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలకు సిపిఎం ప్రణాళికను విడుదల చేశారు. వాస్తవంగా ఇప్పుడు స్థానిక సంస్థలకు అధికారాలు లేకుండా చేశారని, కేంద్రం నుండి వచ్చే నిధులను రాష్ట్రం ఖాతాలో వేసుకుంటోందని అన్నారు. వాటి హక్కులను కాలరాశారని, 73, 74 రాజ్యాంగ సవరణల స్ఫూర్తిని దెబ్బతీశారని తెలిపారు. స్థానిక సంస్థలే స్వయం పాలన చేసుకోవాలంటూ పన్నులు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో గెలిచినా పదవులు అలంకారప్రాయంగా మారాయే తప్ప స్థానిక స్వపరిపాలన చేసుకునేలా లేవని తెలిపారు. గెలిచిన రాజకీయ నాయకులు కూడా కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా ఎలా లాభాలు పొందాలనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి నీడలో పనిచేస్తున్న కూటమి, వైసిపిల పాలనలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల బలోపేతం కోసం సిపిఎం తొలి నుండీ పోరాడుతోందని తెలిపారు. వామపక్షపార్టీలు, పౌర సంఘాల మద్దతుతో పోటీచేస్తున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అలాగే వామపక్ష మద్దతు ఉన్న అభ్యర్థులను కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ ఎన్నికల్లో ప్రజావ్యతిరేక అధికార కూటమిని ఓడించాలని ప్రజలను కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ... స్థానిక ఎన్నికల ప్రధాన ఉద్దేశం స్థానిక సంస్థలను బలోపేతం చేయడమేనని తెలిపారు. అయితే ఇప్పుడున్న టిడిపి కూటమి, వైసిపి, బిజెపిలు స్థానిక హక్కులను కాలరాసి, ప్రతి సేవనూ డబ్బులతో చేయించుకునే విధంగా చేస్తోందని అన్నారు. అధికారులపైనా కూటమి పార్టీ ఒత్తిడి తెస్తోందని అన్నారు. సిపిఎం చెప్పే అధికార వికేంద్రీకరణ మొక్కుబడి తంతుకాదని అన్నారు, పూర్తి ప్రజాస్వామ్యాయుతంగా ఉంటుందని తెలిపారు. దీన్ని సిపిఎం పార్టీగా కేరళ, బెంగాల్, త్రిపురలో అమలు చేసి చూపించామని, ఐఎఎస్ అధికారులు కూడా దీన్ని చూసి హర్షించారని చెప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ నామినేషన్లు లాక్కుని చించేస్తుంటే ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. కలెక్టర్లు, ఎస్పిలు ఫోన్లు కూడా ఎత్తడం లేదని అన్నారు. దళితులు నివశించే ప్రాంతాల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో పౌర సదుపాయాలు మెరుగుపడాలంటే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పాల్పడటం బలవంతంగా పేపర్లు చించేయడం వంటి చర్యలతో అధికార పార్టీ ఏకపక్షంగా నియంతృత్వంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడే ఈ అక్రమ పద్దతులను ప్రోత్సహించారన్నారు. ప్రజల నమ్మకాలపై కాకుండా దౌర్జన్య పద్దతులు అనుసరించారని విమర్శించారు. కొన్ని చోట్ల సిపిఎం అభ్యర్థులపైనా దాడులకు పాల్పడ్డారని అన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని ఎన్నికల సంఘం తక్షణం జోక్యం చేసుకుని సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అనుసరించి అక్రమాలు జరిగిన చోట నామినేషన్లు వేయడానికి తిరిగి అవకాశం కల్పించాలని సిపిఎం తరుపున డిమాండు చేశారు. బుధవారం విజయవాడలోని బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, డి.రమాదేవితో కలిసి శ్రీనివాసరావు మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయనీయకుండా అధికారపార్టీ నాయకులు దౌర్జన్యాలకు దాడులకు పాల్పడ్డారని అన్నారు. పోలీసులు కూడా వారికి వత్తాసు పలికారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకగ్రీవం అయ్యామని ప్రచారం చేసుకుంటున్న అధికార పార్టీ నామినేషన్లు వేయనీయకుండా ఎందుకు దాడులు చేసిందని ప్రశ్నించారు. ఏకగ్రీవాలన్నీ బలవంతంగా చేశారని, ఇదేమి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. గతంలో వైసిపి ఎటువంటి పనిచేసిందో ఇప్పుడు టిడిపి కూడా అటువంటి పనే చేస్తోందని తెలిపారు. ఏకపక్షంగా వ్యవహరించినందుకే సాధారణ ఎన్నికల్లో వైసిపిని ఇంటికి పంపించారని, కూటమికి అదే గతి పడుతుందని తెలిపారు. ఇటువంటి పరిస్థితిని ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు. దాడులు దౌర్జన్యాలతో కాదని, ప్రజాభిప్రాయంతో గెలిచిన వారే నిజమైన రాజకీయ నాయకులని స్పష్టం చేశారు.








కామెంట్లు (0)