మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రాదేశిక ఎన్నికలు రీ షెడ్యూలు

29 అక్టోబర్, 2026

What is Said vs What is Done V Srinivasa Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 11:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎస్‌ఇసికి సిపిఎం లేఖ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అర్నబ్‌ ‌తుపాను నేపథ్యంలో జిల్లా, మండల ప్రాదేశిక ఎన్నికలను బాధిత ప్రాంతాల్లో రీషెడ్యూలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌‌ను కోరారు. ఈ మేరకు గురువారం లేఖ రాశారు. ఈ నెల 27, 28 తేదీల్లో శ్రీకాకుళం మొదలుకొని ఎన్‌టిఆర్ జిల్లా వరకు అర్నబ్ తుపానుకు అతలాకుతలమైందని, తక్షణం ప్రజలు కోలుకోలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

భారీ వర్షాల వల్ల వరదల ముంపు కూడా పొంచి ఉందని, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కేంద్రీకరించి సహాయ కార్యక్రమాలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఆ రీత్యా 5వ తేదీన నిర్వహించే స్థానిక ఎన్నికల వల్ల అధికార యంత్రాంగం తుపాను బాధితులకు సహాయం చేయడానికి ఆటంకమవుతుందని పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో ఈ ఎన్నికలను తుపాను బాధిత ప్రాంతాల్లో రీషెడ్యూలు చేయాలని కోరారు.
letter



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్