బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికల నిర్వహణ విధులలో పాల్గొన్న సిబ్బందికి నిధులు మంజూరు చేయాలి, తగిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి, వి.శ్రీనివాసరావు లేఖ

3 గంటల క్రితం

What is Said vs What is Done V Srinivasa Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 02:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : ఎన్నికల నిర్వహణ విధులలో పాల్గొన్న సిబ్బందికి నిధులు మంజూరు చేయాలని, తగిన సౌకర్యాల ఏర్పాటు కోరుతూ ... రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు బుధవారం లేఖ రాశారు. కార్పొరేషన్, మున్సిపల్, ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలు ముగిసి వారం రోజులు దాటిందన్నారు. ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఏర్పాట్లకు, నిర్వహణకు, పోలీసు సిబ్బందికి భోజన సదుపాయాలకు ఖర్చును చాలా జిల్లాల్లో పంచాయతీ కార్యదర్శులే వారి సొంత డబ్బులతో భరించారనీ ... కానీ ప్రభుత్వం ఆ నిధులను మంజూరు చేయకపోవడంతో వారంతా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత తీసుకొని ప్రభుత్వం నుండి నిధులు విడుదల చేసేట్లు చూడగలరని కోరారు. జివిఎంసి పరిధిలోని ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొన్న సిబ్బందికి 50 శాతం మాత్రమే చెల్లించారని ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై విచారించి తగు చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. అలాగే పోలింగ్ రోజున విధులు నిర్వహించిన టీచర్లు, ఇతర సిబ్బందికి సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో వారు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కొంతమంది మహిళలకు మారుమూల గ్రామాలలో విధులను కేటాయించారని తెలిపారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో వారి భద్రత దృష్ట్యా మహిళలకు మారుమూల పోలింగ్ కేంద్రాలను కేటాయించకుండా చూడాలని అన్నారు. పోలింగ్‌లో పాల్గొన్న సిబ్బందికి దారి ఖర్చులు కూడా ఇవ్వడం లేదని చెప్పారు. కాబట్టి రాబోయే పంచాయతీ ఎన్నికలలో పై అంశాలు దృష్టిలో పెట్టుకొని పోలింగ్ సిబ్బందికి సరైన సౌకర్యాలు, అలవెన్సులు అందేట్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను వి.శ్రీనివాసరావు కోరారు.
Funds should be sanctioned and adequate facilities provided for the staff involved in election management duties V Srinivasa Raos letter to the State Election Commissioner


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్