గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

డాక్టర్ ప్రియాంక మృతి పై విచారణ జరిపించాలి : సిపిఐ(యం)

1 రోజు క్రితం

Probe into Dr. Priyanka's death demanded: CPI(M)
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 03:35 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

విజయవాడ : డాక్టర్ ప్రియాంక మృతిపై విచారణ జరిపించాలని సిపిఐ(యం) డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి బుధవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. రాజమహేంద్రవరంలో ఆగష్టు 3 వ తేదీ రాత్రి మద్యం సేవించి కొందరు దుండగులు పలుమార్లు కారుతో ఢీ కొట్టించి దారుణంగా హత్య చేసిన ఘటనలో డాక్టర్ ప్రియాంక తీవ్రంగా గాయపడి మృతి చెందడం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదన్నారు. సీసీటీవీ దృశ్యాల ప్రకారం మద్యం మత్తులో ఉన్న నిందితులు అత్యంత నిర్లక్ష్యంగా కారును నడుపుతూ ప్రియాంకను పలుమార్లు ఢీకొట్టారని తెలిపారు. ప్రమాదానికి ముందు కూడా ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద భద్రతా సిబ్బందితో వారు ఘర్షణకు దిగినట్లు సి సి కెమెరా ల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అలాంటి నేపథ్యంలో ఈ ఘటనను కేవలం రోడ్డు ప్రమాదంగా పరిగణించడం సరైంది కాదని చెప్పారు. నిందితుల వెనుక పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులున్నారని, వారు కేసు నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. కేవలం రాజమండ్రిలో ప్రజా సంఘాలు, పౌర సమాజం స్పందించి ఆందోళన చేశాకే నిందితులపై హత్యకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని, ఇందులో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. ఘటన జరిగిన రెండు రోజుల తరువాత సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రమే పోలీసులు ప్రెస్‌మీట్ నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించారని వివరించారు. సమాచారం బయటకు రాకుండా తొక్కి పెట్టారు అనేది అనుమానాస్పదంగా ఉంది.. కాబట్టి ఈ మొత్తం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబానికి ప్రకటించిన సహాయం సక్రమంగా లేదన్నారు. ముఖ్యమంత్రి సంతాపం ప్రకటించటమే సరిపోదు అని చెప్పారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలవాలన్నారు. ప్రత్యేకంగా డాక్టర్ ప్రియాంక మృతి ఘటనపై పూర్తి స్థాయిలో, పారదర్శకంగా విచారణ జరిపించి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమండ్ చేస్తున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
Probe into Dr. Priyanka's death demanded: CPI(M)


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్