విజయవాడ : ఢిల్లీలో జర్నలిస్టులపై పోలీసుల దాడిని ఖండిస్తూ ... విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ .... అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారతదేశంలో పత్రికా స్వేచ్ఛపై మరోసారి అత్యంత క్రూరమైన, తీవ్రమైన దాడి జరిగిందన్నారు. 13 కోట్ల మందికి పైగా ఓటర్లను తొలగించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడటం అమానుషమన్నారు. శని, ఆదివారాల్లో జంతర్మంతర్ పరిసరాల్లోనే కాకుండా, నిరసన స్థలానికి కిలోమీటర్ల దూరంలోనూ జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రెస్ ఐడీ కార్డులు చూపించి, జర్నలిస్టులమని చెప్పినా వినిపించుకోలేదనీ, మహిళా జర్నలిస్టులను సైతం బట్టలు పట్టుకుని ఈడ్చుకెళ్లడం, తోసేయడం, దుర్భాషలాడటం, ఫోన్లు లాక్కోవడం, పోలీసుల చర్యలకు సంబంధించిన వీడియోలను తొలగించాలని ఒత్తిడి చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ధ్వజమెత్తారు. ఢిల్లీలో జరిగిన జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోరాడే గొంతుకలను అణచివేయలేరని స్పష్టం చేశారు. జర్నలిస్టులపై దాడులను ఆపాలని, రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు






















కామెంట్లు (0)