విజయవాడ : జిఒ నెంబర్ 3 ను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని వి.శ్రీనివాసరావు కోరారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో శ్రీనివాసరావు మాట్లాడుతూ .... బిజెపి ని ప్రజలు సంపూర్ణంగా తిరస్కరిస్తున్నారని రుజువవుతున్నదన్నారు. అయోధ్య రామమందిర విషయంలో ప్రజలందరినీ రెచ్చగొట్టి ఓట్లు కొల్లగొట్టి అధికారంలోనికి వచ్చి అదే రామమందిరాన్ని కైంకార్యం చేశారని విమర్శించారు. దారుణమైన అవినీతికి, అక్రమాలకు బిజెపి పాల్పడుతున్నదన్నారు. రాష్ట్రంలో టిడిపి, జనసేన మునిగిపోయే పడవను ఎక్కారని, అది ఎప్పుడైనా మునిగిపోవచ్చునన్నారు. విద్యార్థులపై దారుణమైన లాఠీచార్జ్ చేస్తే.. తప్పు అని దేశమంతా ఖండిస్తుంటే ... కేసులను కూడా ఉపసంహరించుకోవల్సిన పరిస్థితి ఏర్పడితే ... ఈ కేసు వినను అని మొండికేసిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సైతం కేసును విని అణచివేత వద్దు.. లాఠీ చార్జ్ చేయొద్దు ... కేసులు పెట్టొద్దు అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడితే... చంద్రబాబు మాత్రం మోడిని పిలిచి భోగాపురంలో పెద్ద సభను పెట్టి స్తోత్ర పాఠాలు వల్లించారని ఇంతకన్నా అవమానకరం ఏమైనా ఉందా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి భోగాపురం ఎయిర్ పోర్టులో వాటానే లేదని, పూర్తిగా అది ప్రైవేటు సంస్థ అని చెప్పారు. భూములు ప్రభుత్వానివి, భూములను దానమిచ్చినవారు రైతులు కానీ దానిలో రాష్ట్రానికి వాటా కూడా లేదు అని తెలిపారు. దీనికి వందలకోట్ల రూపాయలను ఖర్చు పెట్టి వందలాదిమంది విద్యార్థులను అక్కడికి తరలించారని అన్నారు. కనీసం విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతిని కూడా తీసుకోకుండా ఎక్కడికక్కడ విద్యార్థులందరినీ విశాఖకు తరలించారని, మోడికి భజన చేయడానికా పిల్లలున్నది ? అని ప్రశ్నించారు. ఆదివాసీల నిరసనలను అణచివేయాలని చూడటం దుర్మార్గమన్నారు. 7 వ తేదీలోగా జిఒ నెంబర్ 3 ను పునరుద్ధరిస్తే వారంతా శాంతిస్తారనీ, బంద్ చేయాల్సిన అవసరం ఉండబోదు అని చెప్పారు. ఢిల్లీ పరిణామాలను దృష్టిలో పెట్టుకోవాలని, ప్రపంచం తీరు మారుతోందని సూచించారు. అణచివేతలతో యువత నోరు మూయించడం.. ఆందోళనలను ఆపడం ఎవ్వరి తరం కాదని స్పష్టం చేశారు. మోడిలాగానే చంద్రబాబు కూడా మునిగిపోవల్సి వస్తుందని హెచ్చరించారు. తక్షణం పోలీసులతో మాట్లాడి జిఒ నెంబర్ 3 ను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని వి.శ్రీనివాసరావు కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం జిఒ నెంబర్ 3 ను పునరుద్ధరించాలి : వి.శ్రీనివాసరావు
13 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 04, 2026, 12:46 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)